close
అందరికీ ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

 ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సులో కీలకాంశమిదే
 జెనీవా సదస్సుకు హాజరైన తెలంగాణ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: అందరికీ ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వార్షిక సదస్సు చర్చిస్తోంది. జీవనశైలి వ్యాధుల నియంత్రణకు సంబంధించి పక్కా కార్యాచరణ ప్రణాళిక అమలుపై పలు కీలక తీర్మానాలను చేయనుంది. ఈ నెల 20 నుంచి 28 వరకూ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో జరుగుతున్న 72వ ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సదస్సులో ప్రధానంగా ఈ రెండు అంశాలపై ప్రతినిధుల బృందం దృష్టిసారించింది. ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ హాజరైన ఈ సదస్సులో భారత్‌ నుంచి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవగా.. వచ్చే సెప్టెంబరులో నిర్వహించనున్న మరో అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా రాజకీయ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అధ్యక్షులను ఇందులో భాగస్వాములుగా చేయనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.