close
‘రూపాయికే అంత్యక్రియలు’కు ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌ల ప్రశంస

తెలంగాణవ్యాప్తంగా అమలుకు యోచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో మేయర్‌ రవీందర్‌సింగ్‌ ప్రవేశపెట్టనున్న ‘రూపాయికే అంత్యక్రియలు’ పథకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశంసించారు. జూన్‌ 15 నుంచి అమలులోకి వచ్చే ఆ కార్యక్రమం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో సాయపడుతుందంటూ వారిద్దరూ వేర్వేరుగా ట్విటర్‌ ద్వారా అభినందించారు.అంతిమ యాత్ర-ఆఖరి సఫర్‌ పేరిట రూ.కోటిన్నర పైగా కేటాయించడం; ఎటువంటి అంతరాలూ లేకుండా సామాన్యులందరికీ ఉపకరించనుండటం ఆదర్శప్రాయమన్నారు. ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తే చాలు..ఆ కుటుంబీకుల ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేపడతామని మేయర్‌ ప్రకటించడం విదితమే. ఆ రోజున మృతుడి కుటుంబానికి అండగా ఉండేలా 50 మందికి సరిపడా భోజనాన్ని ఐదు రూపాయల వంతున అందిస్తామనడం మానవతను చాటుతోందన్నారు. మేయర్‌తో పాటు కార్పొరేటర్లు, శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ను కొనియాడారు. ఇదే పథకాన్ని వెంటనే అన్ని నగర, పురపాలక సంస్థల పరిధుల్లోనూ అమలుచేయడంపై దృష్టి సారించాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కు మార్‌కు కేటీఆర్‌ సూచించారు. దీనిపై అధ్యయనంతో పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని అర్వింద్‌ తెలిపారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.