close
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సంబరాలు

మూడు ఎంపీ స్థానాలు గెలవడంపై సంతృప్తి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు చేసుకుంది. గురువారం ఉదయం ఓట్లలెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ కోశాధికారి నారాయణరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కిషన్‌ గాంధీభవన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వీక్షించారు. ఎంపీలుగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(నల్గొండ),వెంకటరెడ్డి(భువనగిరి), రేవంత్‌రెడ్డి(మల్కాజిగిరి)లకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా వ్యవహరించారని భట్టివిక్రమార్క అన్నారు. కేసీఆర్‌ నియంత పోకడలకు, కుటుంబ పాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో కీలకంగా ఉన్న కవిత, వినోద్‌కుమార్‌లను, మంత్రులు తలసాని కుమారుడిని, మల్లారెడ్డి అల్లుడిని ఓడించడం ద్వారా ప్రజలు తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ విజయం.. తెరాస నియంత పోకడలకు చెంపపెట్టు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 8 ఎంపీ సీట్లు గెలుస్తామనుకున్నాం.. 3 గెలిచామన్నారు. భాజపా 4 సీట్లు గెలవడంతో కాంగ్రెస్‌కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, దానివల్ల తెరాస ప్రమాదంలో పడిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపు చర్యలకు లోక్‌సభ ఫలితాలు చెంపపెట్టు అని టీపీసీసీ కోశాధికారి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సారు.. కారు.. 16కు తెలంగాణ ప్రజలు బ్రేక్‌ వేశారన్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ వైఫల్యం చెందారని గూడూరు విమర్శించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.