Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120913
            [news_title_telugu_html] => 

సంక్షిప్త వార్తలు 

[news_title_telugu] => సంక్షిప్త వార్తలు  [news_title_english] => [news_short_description] => నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోగా టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఎంపికైన 8792 మంది అభ్యర్థులు గత పది నెలలుగా నియామక పత్రాల కోసం.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
సంక్షిప్త వార్తలు  - EENADU
close
సంక్షిప్త వార్తలు 

టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలివ్వాలి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోగా టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఎంపికైన 8792 మంది అభ్యర్థులు గత పది నెలలుగా నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఇంకా మిగిలిన 22 వేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నిర్వహించాలని, అప్పటి వరకు విద్యావాలంటీర్లతో భర్తీ చేయాలన్నారు. 


తెలంగాణ అటవీ శాఖకు హైకోర్టు నోటీసులు 

ఈనాడు, హైదరాబాద్‌: గత నెలలో జరిగిన బీడీ ఆకుల ఈ-వేలంలో బిడ్‌ను పొందినప్పటికీ, పాత బకాయిలున్నాయంటూ తిరస్కరించడంపై తెలంగాణ అటవీశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టైగర్‌ కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో బీడీ ఆకుల సేకరణ నిమిత్తం ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ-వేలంలో బిడ్‌ దక్కించుకున్న తనకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పి.సంపత్‌రెడ్డి అనే కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు. తనను బిడ్‌ విజేతగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రకటించిందని, అయితే 2017నాటి కాంట్రాక్ట్‌ బకాయిలు చెల్లించలేదని తన బిడ్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీచేశారన్నారు. 2017లో తనతోపాటు బీడీ ఆకుల సేకరణ కాంట్రాక్ట్‌ పొందిన వారందరూ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నారని, బకాయిలు, జరిమానాలు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉందన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం పొందిన కాంట్రాక్ట్‌ను నిరాకరించడం సరికాదన్నారు. బీడీ ఆకుల సేకరణకు మే నెల అనువైనదని, గడువు తీరితే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇటీవల వాదనలను విన్న హైకోర్టు అటవీశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. 


‘కార్పొరేట్‌ ప్రవేశానికి’ దరఖాస్తుల ఆహ్వానం 
ఆఖరు తేదీ జూన్‌ 9 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రముఖమైన కళాశాలల్లో ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌ కోచింగ్‌లో ప్రవేశాలకోసం పదోతరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఎస్సీ సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ‘కార్పొరేట్‌ కళాశాలల పథకం’ కింద ఈ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో స్థానిక విద్యార్థులు ఇందులో లబ్ధి పొందడానికి అర్హులని ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు. పథకం కింద 2,262 సీట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు ఈ-పాస్‌ ద్వారా జూన్‌ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో మెరిట్‌, రిజర్వేషన్ల వారీగా అర్హులైన విద్యార్థులను జూన్‌ 13న ఎంపిక చేసి, ధ్రువపత్రాల పరిశీలన తరువాత ప్రవేశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. 


బధిరుల పాఠశాలలో అడ్మిషన్లు 

వికలాంగుల సంక్షేమశాఖ పరిధిలోని మలక్‌పేట ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 10 తరగతి వరకు ప్రవేశాలకు జూన్‌ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11నుంచి సాయంత్రం 4వరకు దరఖాస్తులు పొందవచ్చని, విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 040-24161000లేదా 7674933347లో సంప్రదించాలని చెప్పారు. 


6, 7 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల 

బీసీ గురుకులాల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు విడుదల చేశారు. ఫలితాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని, కౌన్సెలింగ్‌ తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 


విత్తనాలు, ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలి 

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న కొత్త ఖరీఫ్‌ పంటకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఆదేశించారు. అన్ని జిల్లాల వ్యవసాయాధికారుల(డీఏవో) రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా పాల్గొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ, రైతు సమగ్ర సర్వేను త్వరగా పూర్తిచేయాలన్నారు. నమోదయ్యే సమాచారం ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు, రాయితీల పంపిణీ ఉంటాయన్నారు.  వ్యవసాయ శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన వివరాలపై సమీక్ష జరిపారు. ఆన్‌లైన్‌లో అన్నదాతల వివరాలు నమోదు చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు డీఏవోలు తెలిపారు.


సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు 

బోరబండ, న్యూస్‌టుడే: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈనెల 29, జూన్‌ 1, 5, 8, 12, 15, 19, 22, 26, 29 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు; తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జూన్‌ 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో భువనేశ్వర్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ రైళ్లు బయల్దేరతాయి. 


హాల్‌టికెట్లలో తప్పులొస్తే చెప్పండి 
ప్రిన్సిపాళ్లను కోరిన ఇంటర్‌ బోర్డు 

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి, అభ్యర్థుల హాల్‌టికెట్లలో ఏవైనా దోషాలు ఉంటే వెంటనే సవరిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఆ మేరకు హాల్‌టికెట్లను ఆయా కళాశాలల లాగిన్‌లో 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. వాటిని ప్రిన్సిపాళ్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, పొరపాట్ల సవరణ కోసం 28వ తేదీ లోగా జిల్లా ఇంటర్‌ విద్యాధికారి/నోడల్‌ అధికారి ద్వారా పంపించాలని కోరారు. జూన్‌ 7వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు 4.50 లక్షలమంది హాజరు కావాల్సి ఉందన్నారు.


ఆర్జీయూకేటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు 

బాసర, న్యూస్‌టుడే: రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ)లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును విద్యాలయం పొడిగించింది. నిర్మల్‌జిల్లా బాసరలోని సంస్థలో గతంలో దరఖాస్తుల స్వీకరణకు మే 24 వరకు గడువు విధించగా, వివిధ బోర్డుల పదోతరగతి ఫలితాల విడుదలలో జాప్యం జరగటంతో గడువును తాజాగా పొడిగించారు. విద్యార్థులు మే 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల హార్డ్‌ కాపీలను మే 31 నాటికి విద్యాలయానికి పంపాలని   ఆర్జీయూకేటీ పేర్కొంది. 


డీఎల్‌సీల అనుమతి నుంచి హేచరీలకు మినహాయింపు 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: చేపపిల్లలను పెంచే హేచరీలు, ఫారాల ఏర్పాటుకు జిల్లాస్థాయి కమిటీ(డీఎల్‌సీ)ల అనుమతి నుంచి మినహాయింపు కల్పించారు.ఈ మేరకు శుక్రవారం మత్స్యశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా ఫిషరీస్‌ అధికారి(డీఎఫ్‌వో)కు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో యూనిట్లను నమోదు చేయాలని, లేకుంటే రిజిస్ట్రేషన్‌ అయినట్లే పరిగణిస్తామని పేర్కొన్నారు. చేపపిల్లల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హేచరీలు, ఫారాలు ఏర్పాటయ్యాక డీఎఫ్‌వోలు వెళ్లి తనిఖీ చేస్తారని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి యూనిట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకునే అధికారం మత్స్యశాఖ కమిషనర్‌కు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.


రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.