close
దక్షిణ డిస్కంకు స్మార్ట్‌ సిటీస్‌ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేస్తున్నందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)కు మరో జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. శుక్రవారం దిల్లీలో జరిగిన ఐదో స్మార్ట్‌ సిటీస్‌ సదస్సు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి అందుకున్నారు. నాలుగేళ్లలో 3,885 మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరాకు డిస్కం చర్యలు తీసుకుంది. ఇళ్లపై సౌరవిద్యుత్‌ ఫలకాల(రూఫ్‌టాప్‌) విధానాన్ని ప్రోత్సహిస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఈ సంస్థ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపికైంది. వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరాకు అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తోంది. ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు’ విభాగంలో ఈ పురస్కారం లభించిందని రఘుమారెడ్డి తెలిపారు. రూఫ్‌టాప్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందుకు గతంలోనూ 4 జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చినట్లు చెప్పారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.