close
ఎత్తిపోతల వివరాలు కృష్ణా బోర్డు పరిశీలనకు పంపండి 

కర్ణాటక జలవనరుల శాఖకు కేంద్ర సంఘం సూచన

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా ప్రతిపాదించిన రెండు ఎత్తిపోతల పథకాల వివరాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిశీలనకు పంపాలని కర్ణాటక జలవనరుల శాఖకు కేంద్ర జలసంఘం సూచించింది. ఈ ఎత్తిపోతల పథకాలు కృష్ణా నదిపై ఉన్నందున బోర్డుకు కూడా పంపాల్సిన అవసరం ఉందని తెలిపింది.  కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ ముఖర్జీ కర్ణాటక జలవనరుల శాఖ ఆధ్వర్యంలోని కర్ణాటక నీరావరి నిగమ్‌ లిమిటెడ్‌ (కెఎన్‌ఎన్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఆలమట్టి ఎగువన ఇప్పరిగి ప్రాజెక్టు దిగువన రెండువైపులా రెండు ఎత్తిపోతల పథకాలను కర్ణాటక చేపట్టింది. బెల్గావి జిల్లా అథాని నియోజకవర్గంలోని అయినాపూర్‌ వద్ద కృష్ణా ఎడమ గట్టు నుంచి 27462 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అంచనా విలువ రూ.1369 కోట్లు. దీనివల్ల 22 గ్రామాల్లో రైతులకు ప్రయోజనం కలగనుంది. బెల్గావి, బాగల్‌కోట జిల్లాల్లో 52,700 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు కృష్ణా కుడిగట్టు వైపు తుబచి బబ్లేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం రూ.2488 కోట్లు. ఈ రెండు పథకాల పనులను ఇప్పటికే చేపట్టారు. నీటి లభ్యత, అంతర్‌రాష్ట్ర అనుమతి కోసం కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఆలమట్టి 524 మీటర్ల ఎత్తుకు పెంచిన తర్వాత ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో నీరుంటుంది. డీపీఆర్‌, ప్రాజెక్టు అంచనా వ్యయం వివరాలను కేంద్ర జలసంఘానికి కర్ణాటక అందజేసింది. వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని కోరిన జలసంఘం, ఈ పథకాలు కృష్ణా బేసిన్‌లో ఉన్నందున కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిశీలనకు సైతం పంపాలని సూచించింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.