close
ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ఒప్పందం 

దేశరక్షణ అవసరాల కోసం వీటిని వినియోగిస్తాం: రియల్‌ అడ్మిరల్‌ శరత్‌బాబు

సింధియా(విశాఖపట్నం), న్యూస్‌టుడే: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి శుక్రవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డులో అవగాహన ఒప్పందం కుదిరింది. స్థానికంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ సీఎండీ, రియల్‌ అడ్మిరల్‌ ఎల్వీ శరత్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా ప్రాతిపదికన నిర్మించే జలాంతర్గాములను దేశ రక్షణ అవసరాల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. భారత్‌లో తయారీ నినాదంలో భాగంగా యూ-75(1) పేరిట ఈ జలాంతర్గాములను హిందుస్థాన్‌ షిప్‌యార్డు, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌), మిశ్రదాతు నిగమ్‌ లిమెటెడ్‌ (మిథాని) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొని ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.