close
పదవీ విరమణ వయసు పెంపుపై హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు..ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రీ అండ్‌ పారా క్లినికల్‌ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(పీపీటీజీడీఏ) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ టి.కృపాల్‌సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆరోగ్య తెలంగాణ సాధనకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 40 శాతం డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వయసు పెంపు వల్ల యూజీ, పీజీ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.