close
ఎమ్మెల్యేల భవన సముదాయాన్ని పరిశీలించిన సభాపతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం భవన సముదాయాన్ని పరిశీలించారు. నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి 120 మంది ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో గృహ సముదాయాన్ని నిర్మించారు. సోమవారం ఆ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. పరిశీలన తర్వాత శాసనసభలోని తన కార్యాలయంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, రహదారులు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.