
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఈనెల 24వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. జులై 1 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 1నుంచి విద్యార్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఆప్షన్ల నమోదుకు 4నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. 10న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో జులై 9నాటికి నాలుగో విడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. ఆ తర్వాత ఏపీ ఎంసెట్ సీట్లు కేటాయిస్తే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు రాని వారు రాష్ట్రంలోని కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో కౌన్సెలింగ్‌ను వచ్చే నెలకు మార్పు చేశారు.
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!