close

ప్రధానాంశాలు

సెప్టెంబరు ఒకటి నుంచి ఇంటింటి సర్వే


దూరదృశ్య సమావేశంలో పాల్గొన్న ఇన్‌ఛార్జి జేసీ వినోద్‌కుమార్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే : వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి పౌరుడిని ఓటరుగా చేర్చే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింని ఐటీడీఏ పీవో, ఇన్‌ఛార్జి సంయుక్త కలెక్టరు వినోద్‌కుమార్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌తో దూర దృశ్య సమావేశం జరిగిన తర్వాత దీనికి సంబంధించి ప్రకటనను జారీచేశారు. దీనికి సన్నాహకంగా ఆగస్టు ఐదు నుంచి ప్రచార కార్యక్రమాలు, నమోదు చేసే సిబ్బందికి సామగ్రి పంపిణీ చేస్తామన్నారు.

తప్పుల్లేని ఓటరు జాబితా అందరి బాధ్యత

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించడం అధికార యంత్రాంగంతో పాటు.. ప్రతి పౌరుడి బాధ్యతని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. ప్రత్యేక సమ్మరీ రివిజన్‌-2020లో భాగంగా జిల్లాలో ఆగస్టు 1 నుంచి ఓటరు నమోదు, సవరణ, మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రస్తుత సమ్మరీ రివిజన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని, అందుకనుగుణంగా తప్పుల్లేని, నిష్పక్షపాత ఓటర్ల జాబితాను రూపొందించడం తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు ఓటర్ల జాబితాలను బీఎల్‌వోలు, తహసీల్దారు, ఆర్డీవో, సాధారణ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ అంజనికుమారి పాల్గొన్నారు.

సవరణ వేగవంతం చేయాలి

2020 సంవత్సరానికి సంబంధించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్‌ అధికారి కె.విజయానంద్‌ సూచించారు. గురువారం రాజధాని నుంచి జిల్లా అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణపై పలు కార్యక్రమాలు నిర్వహించాలని, కొత్త ఎపిక్‌కార్డులు పంపిణీ చేయాలని సూచించారు.

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.. ఈ నెలలో నిర్వహించే గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ మండలస్థాయి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.