close
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 సంవత్సరానికి సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో మాల్యశ్రీ (చింతలూరి మల్లయ్య) రచించిన ‘మన్యభారతం’, వచనా కవితలో నారాయణ స్వామి రచన ‘వానొస్తద..?’, గేయ కవిత్వంలో తుమ్మూరి రామమోహన్‌రావు రచన ‘ఎలకోయిల పాట’ సాహితీ పురస్కారాలకు ఎంపికయ్యాయి. బాల సాహిత్యంలో కొల్లూరు స్వరాజ్యం రమణమ్మ రచన ‘అనగనగా పిల్లల కథలు’, కథానికలో బి.మురళీధర్‌ రచన ‘నెమలినార’, కథా సంపుటి, నవలా ప్రక్రియలో భూతం ముత్యాలు రచన ‘మొగలి’, నవల, సాహిత్య విమర్శలో వెంకటరామిరెడ్డి రచన ‘శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం’కు పురస్కారాలు ఇవ్వనున్నారు. నాటకం, నాటిక ప్రక్రియల్లో భారతుల రామకృష్ణ రచించిన ‘సప్త సౌరభాలు’, అనువాదంలో మెహక్‌ హైదరాబాదీ రచించిన ‘గుప్పిట జారే ఇసుక’కు పురస్కారాలు వరించాయి. వచన రచన విభాగంలో కోవెల సంతోష్‌కుమార్‌ రచన ‘దేవ రహస్యం’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో జూపాక సుభద్ర రచించిన ‘రాయక్కమాన్యం’ గ్రంథాలు సాహిత్య పురస్కారాలు పొందాయని తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.