close

ప్రధానాంశాలు

‘వెంకీమామ’ సడెన్‌ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: వెంకటేష్, నాగ చైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు కథానాయకులు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. దీంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.