close

ప్రధానాంశాలు

మందలించాడన్న భయంతో హత్య

భార్యతో చనువుగా ఉన్న వ్యక్తే సూత్రధారి

నలుగురు నిందితుల అరెస్టు.. కేసును ఛేదించిన పోలీసులు

శ్రీకాళహస్తి గ్రామీణం, న్యూస్‌టుడే: తన భార్యతో ఫోన్‌లో చనువుగా మాట్లాడుతున్నాడని అనుమానించి, ఆమె పనిచేసే పరిశ్రమలోని సూపర్‌వైజర్‌ను భర్త గట్టిగా మందలించాడు. అతని వల్ల తనకు ప్రమాదం ఉందని భయంతో ఆమె భర్తనే పథకం వేసి కిరాయికి మనుషులను మాట్లాడుకొని ఆ సూపర్‌వైజర్‌ హత్య చేశాడు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు ఆయా వివరాలను గురువారం శ్రీకాళహస్తిలో తిరుపతి అర్బన్‌ జిల్లా క్రైం అడిషనల్‌ ఎస్పీ అనిల్‌బాబు వెల్లడించారు. వరదయ్యపాళెం మండలం యానాదివెట్టు ఎస్సీకాలనీకి చెందిన మింజురు పవన్‌కుమార్‌ (29), అతని భార్య ఏడాది కిందట శ్రీసిటీలో ఉద్యోగాల్లో చేరారు. కొంతకాలం తరవాత అతను అక్కడ ఉద్యోగం మానేసినా ఆమె మాత్రం చేస్తుండేది.  వరదయ్యపాళెంలో చరవాణి మరమ్మతుల దుకాణాన్ని పెట్టుకొన్నాడు. ఇలాఉండగా ఎప్పుడైనా ఆమె సెలవు పెట్టాల్సివస్తే తన భర్త చరవాణి ద్వారా అక్కడ పనిచేసే సూపర్‌వైజర్‌ గుణశేఖర్‌కు  సమాచారం అందించేది. వారి ఫోన్‌ సంభాషణలను వింటున్న పవన్‌కుమార్‌ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య, గుణశేఖర్‌లను తీవ్రస్థాయిలో మందలించాడు. పవన్‌కుమార్‌ వల్ల తనకు ప్రమాదం పొంచి ఉందని భావించిన గుణశేఖర్‌ ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని హత్యకు పథకం వేశాడు. శ్రీసిటీలోనే పనిచేస్తున్న వరదయ్యపాళెం మండలం రామిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన తన మిత్రుడు మర్రిపల్లి సురేష్‌కు జరిగిన విషయం చెప్పి హత్యకు రూ.2 లక్షలు సుపారీ (కిరాయి) ముట్టజెప్పేందుకు ఒప్పందం చేసుకున్నారు.బుచ్చినాయుడు కండ్రిగ మండలం కారణిమిట్టకు చెందిన తునికాల హరి, సత్యవేడు మండలం మల్లవారిపాళెం గ్రామానికి చెందిన ఆలపాకం అనుష్‌ కుమార్‌ అలియాస్‌ అనీష్, తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా లచివాకం గ్రామానికి చెందిన మునస్వామిమణిలను కలుపుకున్నాడు. పవన్‌కుమార్, హరిలకు గతంలోనే పరిచయం ఉంది. రూ.50 వేలు అప్పుగా కావాలని హరిని పవన్‌కుమార్‌ అడగటంతో దీనినే అదనుగా తీసుకున్నారు. జులై 22న ఉబ్బలమడుగు వద్దకు వస్తే రూ.50వేలు ఇస్తానని హరి చెప్పడంతో పవన్‌కుమార్‌  ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న పై నిందితులందరూ అతన్ని పట్టుకొని రాళ్లతో తీవ్రంగా కొట్టి ద్విచక్ర వాహనం యాక్సిలరేేటర్‌ తీగను మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలోని తెలుగుగంగ కాలువ తూములో పడేసి వెళ్లిపోయారు. జులై 25న తెలుగుగంగ కాలువ తూమువద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలించగా.. దుర్వాసన వస్తుండటంతో తూములో మృతదేహం పడిఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పవన్‌కుమార్‌గా గుర్తించి.. కేసును అన్ని కోణాల్లో పరిశీలించి ఈ హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు. నిందితులను పోలీసులు అరెస్టుచేసి గురువారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండు విధించారు. హతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా... ప్రధాన నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు, బీఎన్‌కండ్రిగ సీఐ మధుసూదనరావు, ఎస్‌ఐ ధర్మారెడ్డి పాల్గొన్నారు. 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.