close
మూడేళ్లలో రూ.2,200 కోట్ల ఆదాయం

ఖనిజాభివృద్ధి సంస్థ ప్రగతి ఇదీ..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ మూడేళ్లలో రూ.2,207.78 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుందని సంస్థ ఛైర్మన్‌, శాసనమండలి సభ్యులు శేరి సుభాష్‌రెడ్డి వెల్లడించారు. సంస్థ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం టీఎస్‌ఎండీసీ ఎండీ డాక్టర్‌ మల్సూర్‌, ఖనిజాభివృద్ధి సంస్థ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి సంస్థ ప్రగతి పథాన్ని వివరించారు. ‘‘2007-08 నుంచి 2013-14 వరకూ రూ.39.69 కోట్లున్న సంస్థ ఆదాయం జులై 2016 నాటికి రూ.535.43 కోట్లకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాది జులై 10వ తేదీ నాటికి రూ.2,207.78 కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక పాలసీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశంతో ఖనిజాభివృద్ధి సంస్థ వృద్ధికి నావంతు కృషి చేశా. నాలుగేళ్లలో 4 కోట్ల 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా చేశాం. దీంతో రూ.2,753.09 కోట్ల ఆదాయం వచ్చింది. మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో 797 హెక్టార్లలో లైమ్‌ స్టోన్‌ గనులను ఓరియంట్‌ సంస్థకు లీజుకు ఇచ్చాం. ఆ సంస్థ రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో 4 వేల కుటుంబాలకు ప్రత్యక్ష, 20 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తోంది. లీజుతో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థకు ఏటా రూ.8.4 కోట్ల ఆదాయం వస్తోంది’’ అని వివరించారు.

32,008 గృహాలు సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా 32,008 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వంద శాతం పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ చిత్రారామచంద్రన్‌ తెలిపారు. మరో 92,306 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తయిందని, 55,764 గృహాల నిర్మాణం వివిధ దశల్లో జరుగుతోందని వివరించారు. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టం (ఓపీఎంఎస్‌) తీసుకువచ్చామన్నారు. బిల్లులు సమర్పించిన 15 రోజుల్లో జిల్లా కలెక్టర్ల ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
* రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు: 2,80,616
* నిర్మాణం ప్రారంభించిన గృహాలు: 1,79,078
* ఇప్పటివరకు చేసిన ఖర్చు: రూ.6,141 కోట్లు

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.