close
బ్రేక్‌ దర్శనాలకు ప్రత్యామ్నాయం ఏంటి?

తితిదే తర్జనభర్జన

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్ల విభజన రద్దుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై తితిదే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 అని మూడు రకాలుగా ఉన్నాయి. ఈ మూడు రకాల టికెట్లు ఉన్న భక్తులకు కొన్ని తేడాలతో దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. బ్రేక్‌ దర్శనం టికెట్లను  విభజించడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. అందరూ రూ.500 చెల్లించి టికెట్లు కొంటున్నా... ఎల్‌-1 వారికి ప్రాధాన్యమిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విభజనపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో టికెట్ల విభజనను రద్దు చేయాలని తితిదే నిర్ణయించింది. నూతన విధానం ఒకటిరెండు రోజుల్లో (బుధ లేదా గురువారం) అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేశారు.

పాత విధానం ఏమిటి?: ఎనిమిదేళ్లకు ముందు వీఐపీ దర్శనం టికెట్లు అందరికీ ఒకే విధానంలో జారీ చేసేవారు. ప్రముఖులు వచ్చే పక్షంలో వైకుంఠం-1లోని 17వ కంపార్టుమెంటు నుంచి ఆలయానికి ప్రత్యేకంగా తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించేవారు. ఇతరులను ఒకే వరుసలో ఆలయంలోకి ప్రవేశపెట్టి ప్రత్యేక మర్యాదలు లేకుండా శ్రీవారి దర్శనం కల్పించారు. ఈ విధానాన్ని పునరుద్ధరించాలని తితిదే భావిస్తోంది. దాతల విషయంలో తితిదేకు చిక్కువచ్చింది. రూ.కోటి విరాళం ఇచ్చిన భక్తులకు ఎల్‌-1 కేటగిరి, రూ.10 లక్షలు పైబడి ఇచ్చిన వారికి ఎల్‌-2 కింద దర్శనం చేయిస్తామనే పూచీతో విరాళాలు సేకరించింది. ఆ విధంగానే వారికి దర్శనాలు కల్పిస్తున్నారు.మరోవైపు అర్చనానంతర (ఏఏడీ) దర్శన ప్రస్తావన తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి మంగళవారం తెచ్చారు. ఈ దర్శనాన్ని పదేళ్ల కింద తితిదే రద్దు చేసింది. అప్పట్లో అక్రమాలను  నియంత్రించలేక దర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. సుబ్బారెడ్డి తాజా ప్రస్తావనతో దీనిపై మళ్లీ చర్చ నడుస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.