close
13 సమస్యలపై సీఎస్‌కు లేఖ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి-టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ఎస్‌కే జోషికి లేఖ రాస్తూ, మొత్తం 13 సమస్యలను దృష్టికి తెచ్చారు. సర్వీసు నిబంధనల రూపకల్పన జరగాలని; జేఎల్‌, డైట్‌, ఎంఈవో, జీహెచ్‌ఎం పదోన్నతులు కల్పించాలని; సీపీఎస్‌ రద్దు కావాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని; భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌ జరపాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.