close
కరీంనగర్‌, తిరుపతి మధ్య  ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక సర్వీసులుగా కరీంనగర్‌, తిరుపతి మధ్య నడుస్తున్న రైళ్లను (నంబరు 02761/02762) సెప్టెంబరు వరకు పొడిగిస్తున్నట్లు గురువారం దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. వీటితో రెండు వైపులా కలిపి ప్రయాణికులకు 62 ‘స్పెషల్స్‌’ అందుబాటులోకి రానున్నాయి. ఇవి వారానికి మూడురోజులు నడుస్తున్నాయి. కరీంనగర్‌ నుంచి తిరుపతి వరకు జులై 22-సెప్టెంబరు 30 మధ్య ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో మొత్తం 31 సర్వీసులను ద.మ.రైల్వే నడపనుంది. రాత్రి 7.15కి బయల్దేరే బండ్లు మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు గమ్యం చేరుకుంటాయి. తిరుగుప్రయాణంలో తిరుపతి మొదలు కరీంనగర్‌ వరకు జులై 21-సెప్టెంబరు 29 మధ్య 31 రైలు సర్వీసులు వెళతాయి. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో తిరుపతి నుంచి రాత్రి 10.40కి బయల్దేరి మర్నాటి ఉదయం 10.55 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటాయి. కరీంనగర్‌-తిరుపతి ప్రత్యేకరైళ్లను రెగ్యులర్‌ బండ్లుగా మార్చాలని, వారానికి మూడు రోజులు కాకుండా వారంలో ప్రతిరోజూ నడపాలని ప్రయాణికుల నుంచి పలు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు జనరల్‌ మేనేజర్‌ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. రైల్వేబోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.