Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 155639
            [news_title_telugu_html] => 

మద్యం చిల్లర వర్తకంలోకి ఏపీఎస్‌బీసీఎల్‌

[news_title_telugu] => మద్యం చిల్లర వర్తకంలోకి ఏపీఎస్‌బీసీఎల్‌ [news_title_english] => [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
మద్యం చిల్లర వర్తకంలోకి ఏపీఎస్‌బీసీఎల్‌ - EENADU
close
మద్యం చిల్లర వర్తకంలోకి ఏపీఎస్‌బీసీఎల్‌

ప్రభుత్వం తరఫున మద్యం దుకాణాల నిర్వహణ
సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితమైన ఈ సంస్థ మద్యం దుకాణాలను నడపనుంది. రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమల్లో భాగంగా...ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని సవరించనుంది. ముసాయిదా సవరణ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.