close
సర్కారు దవాఖానాలకు ‘కార్పొరేట్‌’ సహకారం

  వైద్య మంత్రితో ఔషధ సంస్థల భేటీ
  ఉస్మానియాలో రూ.120 కోట్లతో  భవనం నిర్మాణానికి సూత్రప్రాయ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రంలోని ఔషధ సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఔషధ సంస్థల ప్రతినిధులు గురువారం ఈ అంశంపై భేటీ అయ్యారు. ఔషధాలు, వైద్య పరికరాలు, భవనాల నిర్మాణం తదితర అంశాల్లో సీఎస్‌ఆర్‌ కింద సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఉస్మానియా ఆసుపత్రి పురాతన భవనం వారసత్వ భవనంగా గుర్తింపు పొందిన దృష్ట్యా.. దాని ఆనవాళ్లు దెబ్బతినకుండా ఆసుపత్రి వెనుక భాగంలో 9 అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని, ఇందుకు రూ.120 కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశాలున్నాయనే అంశం చర్చకొచ్చింది.  స్పందించిన కొన్ని ఔషధ సంస్థలు భవన నిర్మాణంలో భాగస్వామ్యానికి అప్పటికప్పుడే తమ సానుకూలత వ్యక్తం చేశాయి. మరికొన్ని సంస్థలు పైస్థాయిలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్న కొన్ని సంస్థలు ముందుకొచ్చినా రూ.120 కోట్ల సమీకరణ పెద్ద విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని ఔషధ సంస్థలు రక్తశుద్ధి కేంద్రాలు నెలకొల్పుతామని, మరికొన్ని సంస్థలు ఔషధాలు సమకూర్చుతామని తెలిపాయి. ఈ అంశంపై పక్కా ప్రణాళిక రూపొందించుకొని మరోసారి ఔషధ సంస్థలతో భేటీ కావాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైద్యంలో మెరుగైన సేవలు అందించడానికి ముందుకొచ్చిన ఔషధ సంస్థల ప్రతినిధులకు మంత్రి ఈటల అభినందనలు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.