close
సాంకేతిక లోపం..5 గంటల ఆలస్యం

శంషాబాద్‌ మీదుగా విశాఖకు వెళ్లే ప్రయాణికుల అగచాట్లు

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: సాంకేతిక లోపం కారణంగా.. ముంబయి నుంచి శంషాబాద్‌ మీదుగా విశాఖపట్నం వెళ్లాల్సిన ఓ విమానం ఐదు గంటలపాటు ఆలస్యమైంది. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు పలు అవస్థలపాలయ్యారు. ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు పొంతన లేని సమాధానం చెప్పడంతో తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎస్‌జీ-421 విమానం ఆదివారం ఉదయం 7.15కు శంషాబాద్‌కు చేరాల్సి ఉంది. ఇక్కడి నుంచి విశాఖ వెళ్లాల్సినవారు అప్పటికే విమానాశ్రయానికి చేరుకొని, తనిఖీలు పూర్తిచేసుకొని, ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. సాంకేతిక లోపంతో ముంబయిలోనే ఆగిపోయిన ఆ విమానం మరమ్మతులు పూర్తిచేసుకుని తీరిగ్గా శంషాబాద్‌కు చేరింది. అది మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు బయల్దేరుతుందని అధికారులు ప్రకటించడంతో గంటల తరబడి వేచి ఉన్న  ప్రయాణికులు ఆగ్రహంవ్యక్తం చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.