close
కేంద్రం వద్దన్నందునే ఇవ్వలేకపోతున్నాం!

అమరావతికి రుణం ప్రతిపాదన రద్దుపై ప్రపంచబ్యాంకు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ప్రతిపాదనను భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రపంచబ్యాంకు ఆదివారం స్పష్టీకరించింది. ప్రతిపాదిత ‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు- సంస్థాగత అభివృద్ధి’ ప్రాజెక్టుకు రుణం కోసం గతంలో చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్టుగా ఈ నెల 15న భారత ప్రభుత్వం తమకు లేఖ రాసినట్టు పేర్కొంది. భారత ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రుణం ప్రతిపాదనను తాము రద్దు చేసుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగినప్పటికీ...ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.