close
సిద్దిపేట జిల్లాకు రూ.100 కోట్ల ప్రత్యేక నిధి

ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రత్యేకాభివృద్ధి నిధి మంజూరు చేసింది. మంగళవారం పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం తన పురిటిగడ్డ సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడకలో పర్యటించారు. ఈ సందర్భంగా చింతమడక, గతంలో ఈ గ్రామ పంచాయతీలో అంతర్భాగంగా ఉండి తర్వాత పంచాయతీలుగా మారిన సీతారాంపల్లి, మాచాపూర్‌ల పురోగతిపై మాట్లాడారు. సిద్దిపేట పట్టణం, ఈ  నియోజకవర్గంలోని 81 గ్రామపంచాయతీలు, తాను చదువుకున్న తోర్నాల, పుల్లూరుతో పాటు, దుబ్బాక పట్టణం అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేశారని, నిర్దేశిత పనులకు త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తామని జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.