close
టిస్‌ కోర్సులను ప్రారంభిస్తున్నాం

హైకోర్టుకు తెలిపిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌)కు సంబంధించి హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న కోర్సులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంగళవారం కేంద్రం హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్‌లోని టిస్‌లో కోర్సులను నిలిపివేస్తూ ఈ నెల 15న ముంబయిలోని టిస్‌ రిజిస్ట్రార్‌ (యాక్టింగ్‌) జారీ చేసిన నోటీసును సవాల్‌ చేస్తూ ఎన్‌.అరవింద కార్తీక్‌తోపాటు మరో అయిదుగురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు జారీ చేసినందున టిస్‌లో కోర్సులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం తరఫు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పగా గడువు కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.