close
పాలమూరుకు పోటెత్తుతున్న వరద 

భీమా, తుంగభద్రలకు పెరిగిన ఇన్‌ఫ్లో

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలవారిని వరద భయం వెన్నాడుతోంది. కృష్ణా, భీమా, తుంగభద్రలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో చాలాచోట్ల తీర ప్రాంత ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరికొన్ని గ్రామాల్లో అవసరమైతే ఇళ్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులు దండోరా వేయిస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని తీరగ్రామాలను వరద జలాలు తాకుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా మండలంలోని హిందూపూర్‌, వాసూనగర్‌, మందిపల్లి, గుర్జాలకు వరదనీరు వచ్చింది. ఈ నాలుగు గ్రామాల్లోని 319 కుటుంబాలను కున్సిలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ కేంద్రానికి తరలించగా, 957 మంది ఆశ్రయం పొందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని దత్తక్షేత్రం 10 అడుగుల వరకు మునిగిపోయింది. గద్వాల మండలంలో కృష్ణా నది మధ్యలో ఉండే గుర్రంగడ్డ గ్రామం చుట్టూ నీరు చేరడంతో 1000 మంది గ్రామస్థులకు బయటి ప్రపంచంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.

ఫోన్‌ మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న వ్యక్తి 
రాజోలి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన సయ్యద్‌ వలి సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామం పక్కన ఉన్న సుంకేసుల డ్యాంలో చిక్కుకోవడంతో స్థానిక జాలర్లు కాపాడారు. స్నానానికని వెళ్లిన అతడు డ్యాం వైపు చూడకుండా ఫోన్‌ మాట్లాడుతూ ఉండిపోయాడు. డ్యాం నుంచి నీటిని విడుదల చేయటంతో ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. ఓ బండరాయి మీదకు చేరుకున్న అతడిని జాలర్లు కాపాడారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.