Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173900
            [news_title_telugu_html] => 

వైద్యం అందాలంటే వాగు దాటాల్సిందే!

[news_title_telugu] => వైద్యం అందాలంటే వాగు దాటాల్సిందే! [news_title_english] => [news_short_description] => భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో ప్రసవం, ప్రసవానంతర చికిత్స కోసం గిరిజన మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గుండాల మండలంలో ఓ బాలింతను ఆరోగ్య [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
వైద్యం అందాలంటే వాగు దాటాల్సిందే! - EENADU
close
వైద్యం అందాలంటే వాగు దాటాల్సిందే!

గుండాల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో ప్రసవం, ప్రసవానంతర చికిత్స కోసం గిరిజన మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గుండాల మండలంలో ఓ బాలింతను ఆరోగ్య కేంద్రానికి చేర్చేందుకు కుటుంబసభ్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దేవళ్లగూడెం గ్రామానికి చెందిన పాయం ఉషారాణి శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు సంజీవని వాహనానికి సమాచారం అందించారు. దేవళ్లగూడెం వెళ్లాలంటే కన్నాయిగూడెం సమీపంలోని మల్లన్నవాగు, లింగగూడెం సమీపంలోని ఎదర్రేవు వాగును దాటాల్సి ఉంటుంది. రెండుచోట్లా వాగులు ప్రవహిస్తుండటంతో 108 వాహనం వెళ్లే పరిస్థితి లేదు. అదృష్టవశాత్తు ఉషారాణి ఇంటి వద్దనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లి, బిడ్డలకు చికిత్స అందించడానికి వారిని ఆటోలో ఎదర్రేవు వాగు వద్దకు తరలించారు. 108 సిబ్బంది.. కుటుంబ సభ్యుల సాయంతో స్ట్రెచర్‌పై బాలింతను ఇవతలి ఒడ్డుకు చేర్చి వాహనంలో గుండాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.