Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174565
            [news_title_telugu_html] => 

వీఆర్‌వో వ్యవస్థ ఎంతవరకు అవసరం?

[news_title_telugu] => వీఆర్‌వో వ్యవస్థ ఎంతవరకు అవసరం? [news_title_english] => [news_short_description] => గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వోలు) ఎటువంటి సేవలు అందిస్తున్నారు, మారుతున్న ప్రజావసరాలను తీర్చేలా అవి ఉంటున్నాయా..అని ప్రభుత్వం అభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికీ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
వీఆర్‌వో వ్యవస్థ ఎంతవరకు అవసరం? - EENADU
close
వీఆర్‌వో వ్యవస్థ ఎంతవరకు అవసరం?

క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వోలు) ఎటువంటి సేవలు అందిస్తున్నారు, మారుతున్న ప్రజావసరాలను తీర్చేలా అవి ఉంటున్నాయా..అని ప్రభుత్వం అభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికీ ఒకరి అవసరం ఉందా, వారి విధులు ఏ మేరకు కీలకంగా మారాయి అంటూ క్షేత్రస్థాయి నుంచే ఆరాతీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇవే అంశాలపై జనం మనోగతం తెలుసుకోవాలని ప్రయత్నించారు. ముఖ్యంగా చింతమడక, ఎర్రవల్లి ప్రాంతాల్లోని పలువురు గ్రామవాసులతో వివరంగా మాట్లాడారు.రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు ప్రభుత్వ కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో..ఇటువంటి పరిణామాలన్నీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.గతంలో ఎన్నికల ప్రచార సభలతో పాటు శాసనసభ సమావేశాల్లోనూ ఆయన ‘రెవెన్యూశాఖలో అవినీతి’పై ఆగ్రహం వ్యక్తంచేయడం విదితమే. కొన్ని జిల్లాల్లో వీఆర్‌వోలతో సహా కొందరు అధికారులు అక్రమాల బాటపట్టడంపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం చేరవేశాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల అభిప్రాయాలనూ క్రోడీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. భూ దస్త్రాల నిర్వహణకు సంబంధించి మరిన్ని మేలైన విధానాలను ప్రవేశపెట్టనున్నారు. వాటిని కొత్త చట్టంలో పొందుపరచడం ద్వారా మంచి మార్పు తేవాలన్నదే సర్కారు అభిమతం. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు తోడు తహసీల్దారు, నాయబ్‌ తహసీల్దారు (డీటీ), ఇతరుల పాత్ర ఎంతవరకు ఉండాలన్నదీ త్వరలోనే నిర్ణయమవుతుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.