Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175178
            [news_title_telugu_html] => 

హోమియోతో జీవనశైలి వ్యాధుల నివారణ 

[news_title_telugu] => హోమియోతో జీవనశైలి వ్యాధుల నివారణ  [news_title_english] => [news_short_description] => తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్నిచ్చే మందు హోమియోపతి అని, దీని ద్వారా  జీవనశైలి వ్యాధుల నివారణ సాధ్యమని త్రిదండి చినజీయర్‌ స్వామిజీ అన్నారు. మూలాల్లోకి వెళ్లి జబ్బును నయం చేసే గుణం హోమియోలో ఉందని..ఇతర మందుల మాదిరి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియో వైద్య ఫిజీషియన్స్‌(ఐఐహెచ్‌పీ) ఆధ్వర్యంలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/T5fr9BmeMGo [news_videoinfo] => |https://www.youtube.com/embed/T5fr9BmeMGo [news_sections] => ,30,29, ) )
హోమియోతో జీవనశైలి వ్యాధుల నివారణ  - EENADU
close
హోమియోతో జీవనశైలి వ్యాధుల నివారణ 

రాష్ట్ర హోమియో వైద్య సదస్సులో చినజీయర్‌ స్వామిజీ

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్నిచ్చే మందు హోమియోపతి అని, దీని ద్వారా  జీవనశైలి వ్యాధుల నివారణ సాధ్యమని త్రిదండి చినజీయర్‌ స్వామిజీ అన్నారు. మూలాల్లోకి వెళ్లి జబ్బును నయం చేసే గుణం హోమియోలో ఉందని..ఇతర మందుల మాదిరి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియో వైద్య ఫిజీషియన్స్‌(ఐఐహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ హోమియో వైద్య రెండో సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో హోమియో అత్యధిక ప్రాచుర్యం పొందిందన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో తక్కువ ఖర్చయ్యే హోమియో వైద్యం అవసరం ఎంతైనా ఉందన్నారు. సదస్సుకు హాజరైన కాబోయే వైద్యులు హోమియో వైభవాన్ని తెలుసుకుని.. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవం హోమియోపై విశ్వాసం పెంచేందుకు దోహదం చేసిందన్నారు. దేశంలో హోమియో వైద్యం వాడే వారి శాతం 26.3కు పెరిగినట్లు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, సదస్సు రిసెప్షన్‌ కమిటీ ఛైర్మన్‌ వేణుగోపాలాచారి అన్నారు. దేశంలో హోమియోపతి మార్కెట్‌ ప్రపంచ మార్కెట్‌ కంటే వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. ఆయుష్‌విభాగం అదనపు సంచాలకులు జనార్దన్‌రెడ్డి, సునిర్మల్‌ సర్కార్‌, ముక్తిందర్‌సింగ్‌ మాట్లాడారు.

యాదాద్రిలో జీయర్‌ ఆశ్రమం! 
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆశ్రమంతోపాటు కుటీరం నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దృఢ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణంలో స్వామిజీ సలహాలు తీసుకొంటూ ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్వామి గౌరవార్ధం ఆశ్రమ నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. పెద్దగుట్టపై లేదా గండిచర్ల ప్రాంగణంలో స్థలాన్ని కేటాయించే అవకాశాలున్నాయి.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.