Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176554
            [news_title_telugu_html] => 

నడుం దాకా పూడ్చుకుని రైతు నిరసన 

[news_title_telugu] => నడుం దాకా పూడ్చుకుని రైతు నిరసన  [news_title_english] => [news_short_description] => రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చి తనకు  అన్యాయం చేశారంటూ మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/PHipxlYsmZo [news_videoinfo] => |https://www.youtube.com/embed/PHipxlYsmZo [news_sections] => ,30,29, ) )
నడుం దాకా పూడ్చుకుని రైతు నిరసన  - EENADU
close
నడుం దాకా పూడ్చుకుని రైతు నిరసన 

రెవెన్యూ రికార్డులు మార్చిన అధికారులపై చర్యల్లేవంటూ వినూత్న ఆందోళన

డోర్నకల్‌, న్యూస్‌టుడే: రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చి తనకు  అన్యాయం చేశారంటూ మహబూబాబాద్‌ జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టారు. డోర్నకల్‌ మండలం పెరుమాండ్లసంకీస గ్రామానికి చెందిన మారెడ్డి నాగేందర్‌రెడ్డి మంగళవారం తన వ్యవసాయ భూమిలో గొయ్యి తవ్వి.. నడుం వరకూ మట్టిని పూడ్చుకుని నిరసన వ్యక్తంచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే తాను ఈ చర్యకు దిగానన్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్‌ తహసీల్దార్‌ నరసింహారావు, సీఐ శ్యాంసుందర్‌ వెళ్లి.. నిరసన విరమించాలని నాగేందర్‌రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆయన ససేమిరా అనడంతో వారు జాయింట్‌ కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో కొమురయ్యలతో ఫోన్‌లో మాట్లాడించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే తాను ఆందోళన విరమిస్తానని నాగేందర్‌ పేర్కొనడంతో సుమారు రెండున్నర గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో చేరుకొని నాగేందర్‌కు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్‌  నరసింహారావు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితిని విచారించి మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని, దానిని పరిశీలించి ప్రభుత్వం విచారణకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తుందని పేర్కొన్నారు. దీంతో దీక్ష విరమించి బయటకొచ్చిన నాగేందర్‌రెడ్డి స్పందిస్తూ.. తాను ఈ నెలాఖరు వరకు వేచి చూస్తానన్నారు. తనకు 10 ఎకరాలు ఉండగా.. అధికారులు ట్యాంపరింగ్‌కు పాల్పడి 4 ఎకరాలుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు నాగేందర్‌రెడ్డిపై ఆత్మహత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.