Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177051
            [news_title_telugu_html] => 

అప్పీలును ఉపసంహరించుకున్న చెన్నమనేని 

[news_title_telugu] => అప్పీలును ఉపసంహరించుకున్న చెన్నమనేని  [news_title_english] => [news_short_description] => భారత పౌరసత్వం వ్యవహారంలో అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గత నెల [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
అప్పీలును ఉపసంహరించుకున్న చెన్నమనేని  - EENADU
close
అప్పీలును ఉపసంహరించుకున్న చెన్నమనేని 

అనుమతించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: భారత పౌరసత్వం వ్యవహారంలో అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గత నెల సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన అప్పీలును వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బుధవారం ఉపసంహరించుకున్నారు. పౌరసత్వం విషయంలో తాను తప్పుడు సమాచారం ఇచ్చానని సింగిల్‌ జడ్జి తప్పుగా పేర్కొన్నారంటూ చెన్నమనేని దాఖలు చేసిన అప్పీలుపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనుకూలంగా వచ్చిన తీర్పుపై అప్పీలు దాఖలు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పౌరసత్వం వ్యవహారంలో చెన్నమనేని తప్పు చేసినట్లుగా కేంద్రం పేర్కొన్నప్పటికీ.. సింగిల్‌ జడ్జి ఆ మాట వాడలేదన్న విషయాన్ని గమనించాలంది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అప్పీలును ఉపసంహరించుకుంటానన్న చెన్నమనేని అభ్యర్థనను అనుమతించింది.

ఎన్‌కౌంటర్‌పై సాక్షుల వాంగ్మూలం నమోదుకు ఆదేశం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జులై 31న జరిగిన లింగయ్య ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఇల్లెందు మేజిస్ట్రేట్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షులకు రక్షణ కల్పించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ పిటిషన్‌పై బుధవారం మరోసారి విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.