Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177054
            [news_title_telugu_html] => 

యూనిట్‌ జాతీయ సగటు ధర రూ.3.60 

[news_title_telugu] => యూనిట్‌ జాతీయ సగటు ధర రూ.3.60  [news_title_english] => [news_short_description] => విద్యుత్‌ కొనుగోలుకు జాతీయ సగటు ధర(ఏపీపీసీ)ను నిర్ణయిస్తూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) తాజాగా రాష్ట్ర విద్యుత్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
యూనిట్‌ జాతీయ సగటు ధర రూ.3.60  - EENADU
close
యూనిట్‌ జాతీయ సగటు ధర రూ.3.60 

కేంద్ర ఈఆర్‌సీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోలుకు జాతీయ సగటు ధర(ఏపీపీసీ)ను నిర్ణయిస్తూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) తాజాగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సగటు ధర యూనిట్‌కు రూ.3.60గా ఖరారు చేసింది. దీన్నే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో విద్యుత్‌ కొనుగోలుకు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల(2015-20)లో ఏపీపీసీ యూనిట్‌ ధరను మండలి రూ.3.40 నుంచి రూ.3.60కు పెంచింది. గతేడాది అన్ని రాష్ట్రాల విద్యుత్‌ కొనుగోలు ధరలు, కొన్న కరెంటు వివరాల ఆధారంగా ఈ ఏడాదికి ఏపీపీసీని ఖరారు చేసినట్లు మండలి స్పష్టంచేసింది. ఇందులో కరెంటు సరఫరా వ్యయం కలపలేదని తెలిపింది.

ఎందుకీ జాతీయ సగటు ధర.. 
సాధారణంగా డిస్కంలు ప్రజలకు, పరిశ్రమలకు రోజూ కరెంటు సరఫరా చేసి నెలవారీ బిల్లులు వసూలు చేస్తాయి. ఇలా డిస్కంలు వసూలు చేసే ఛార్జీలు ఎక్కువగా ఉంటే మార్కెట్‌లో నేరుగా కరెంటు కొనుగోలు చేసే వెసులుబాటు వినియోగదారులకు ఉంది. దీన్ని ఓపెన్‌ యాక్సిస్‌ విధానం అంటారు. సాధారణంగా పరిశ్రమలు ఇలా కొంటుంటాయి. వీరు ఎంతకు కొనాలో అవగాహన ఉండటానికి జాతీయ స్థాయిలో నిర్ణయించే సగటు ధర ఉపయోగపడుతుంది. దాని ఆధారంగా వారికి నచ్చిన చోట ఓపెన్‌ యాక్సిస్‌లో కొనుక్కోవడానికి అవకాశముంటుంది. వీరే కాకుండా సొంత అవసరాల కోసం పవన, సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేవారు తాము వాడుకోగా మిగిలిన కరెంటును డిస్కంలకు లేదా ఓపెన్‌ యాక్సిస్‌లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. వారి నుంచి ఎంతకు కొనుగోలు చేయాలనేదానికి కూడా ఏపీపీసీని ప్రామాణికంగా తీసుకుని చర్చించుకుని నిర్ణయించుకోవచ్చు. డిస్కంలు నేరుగా బయట విద్యుత్‌ కొనేటప్పుడు కూడా ఏపీపీసీని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.