Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177059
            [news_title_telugu_html] => 

109 రోజులను 8కి కుదించలేదు 

[news_title_telugu] => 109 రోజులను 8కి కుదించలేదు  [news_title_english] => [news_short_description] => మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 109 రోజుల నుంచి 8 రోజులకు కుదించలేదని, వార్డుల విభజన ప్రక్రియకు మాత్రమే 8 రోజులు గడువు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/jzxDgn285y0 [news_videoinfo] => |https://www.youtube.com/embed/jzxDgn285y0 [news_sections] => ,30,29, ) )
109 రోజులను 8కి కుదించలేదు  - EENADU
close
109 రోజులను 8కి కుదించలేదు 

వార్డుల విభజనకు మాత్రమే  8 రోజులు 
అభ్యంతరాలన్నీ నిబంధనల ప్రకారమే పరిష్కారం 
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 109 రోజుల నుంచి 8 రోజులకు కుదించలేదని, వార్డుల విభజన ప్రక్రియకు మాత్రమే 8 రోజులు గడువు నిర్దేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. వార్డుల విభజన నిమిత్తం ఇచ్చిన జీవో 459లో 8 రోజులు గడువు విధించామని, అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లు సులభంగా ఏకరూప విధానంలో విభజన ప్రక్రియ కొనసాగించడానికి ఈ జీవో జారీ చేసినట్లు తెలిపింది. జూన్‌ 30 నుంచి జులై 7లోగా విభజన షెడ్యూలును నిర్దేశిస్తూ జీవో 459 జారీ చేశామంది. వార్డుల విభజనకు మార్గదర్శకాలతో జారీ చేసిన జీవో 78లో ఎలాంటి గడువు లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఎన్నికల గడువును కుదించడంపై ఆదిలాబాద్‌కు చెందిన అంజుకుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. వార్డుల విభజన తరువాత మూడో దశలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణకు షెడ్యూలు జారీ చేసిందని, సింగిల్‌ జడ్జి దీనికి 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దీన్ని 7 రోజులకు కుదించిందన్నారు. ఈ పిటిషన్‌లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అదనపు కౌంటరు దాఖలు చేశామని గురువారం విచారణ చేపట్టాలన్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. దీనిపై పిటిషనర్లకు గడువు ఇస్తూ విచారణను 28కి వాయిదా వేసింది.

24 గంటలు కాదు 5 రోజులు 
అభ్యంతరాలను తెలపడానికి నోటీసు బోర్డుల్లో ఉంచామని, స్థానిక పత్రికల్లో ప్రకటనలు జారీ చేశామని, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ కౌన్సిల్‌ అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత కమిషనర్లు పరిశీలించి నిర్ణయం తీసుకున్నారని ముఖ్యకార్యదర్శి కౌంటరులో పేర్కొన్నారు. హైకోర్టు పేర్కొన్నట్లుగా 24 గంటల్లో పరిష్కరించలేదని 5 రోజులు గడువు తీసుకున్నట్లు తెలిపారు. 123 మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున 1373 అభ్యంతరాలు వచ్చాయన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.