Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177080
            [news_title_telugu_html] => 

కాన్సుల్‌ జనరల్‌గా జోయోల్‌ రిఫ్మాన్‌ బాధ్యతల స్వీకరణ

[news_title_telugu] => కాన్సుల్‌ జనరల్‌గా జోయోల్‌ రిఫ్మాన్‌ బాధ్యతల స్వీకరణ [news_title_english] => [news_short_description] => హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌గా జోయెల్‌ రిఫ్మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్‌లోని అమెరికా రాయబార [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
కాన్సుల్‌ జనరల్‌గా జోయోల్‌ రిఫ్మాన్‌ బాధ్యతల స్వీకరణ - EENADU
close
కాన్సుల్‌ జనరల్‌గా జోయోల్‌ రిఫ్మాన్‌ బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌గా జోయెల్‌ రిఫ్మాన్‌ బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. మంగళవారం రిఫ్మాన్‌ బాధ్యతలు స్వీకరించినట్లు బుధవారం కాన్సులేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రిఫ్మాన్‌ గతంలో వాషింగ్టన్‌ డీసీ, అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, పనామా, పాకిస్థాన్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరకముందు ఆయన అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ జడ్జిగా పనిచేశారు. మిషిగన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ, సదరన్‌ మెథడిస్ట్‌ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. ఇటీవలి వరకు కాన్సుల్‌ జనరల్‌గా ఉన్న కేథరిన్‌ హడ్డా మూడేళ్ల పదవీ కాలం పూర్తికావటంతో తిరిగి అమెరికా వెళ్లారు.

భారత్‌-అమెరికా బంధం పటిష్ఠమైంది: రిఫ్మాన్‌ 
భారత్‌-అమెరికాబంధం పటిష్ఠమైందని జోయెల్‌ రిఫ్మాన్‌అన్నారు. ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశారాష్ట్రాలతో బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయని చెప్పారు. రెండు దేశాలమధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని వెల్లడించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.