Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177717
            [news_title_telugu_html] => 

105 రోజుల్లో పర్యావరణ అనుమతులు

[news_title_telugu] => 105 రోజుల్లో పర్యావరణ అనుమతులు [news_title_english] => [news_short_description] => రాష్ట్రస్థాయిలో ఇచ్చే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. 105 రోజుల్లోనే అనుమతులు జారీకానున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
105 రోజుల్లో పర్యావరణ అనుమతులు - EENADU
close
105 రోజుల్లో పర్యావరణ అనుమతులు

 ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో చేపట్టాలి
 రాష్ట్రాలకు కేంద్ర పర్యావరణశాఖ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయిలో ఇచ్చే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. 105 రోజుల్లోనే అనుమతులు జారీకానున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అనుమతుల ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని పేర్కొంది. సుమారు 38 రకాల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏ కేటగిరి ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ శాఖ, బి కేటగిరి వాటికి రాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తాయి. 5 హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఉన్న క్వారీలు, గ్రానైట్‌ సహా అన్ని రకాల మైనింగ్‌ ప్రాజెక్టులు, 20 వేల చదరపు మీటర్లను మించిన నిర్మాణ పనులు, పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ వంటివి బి జాబితాలోకి వస్తాయి. వివిధ కారణాలతో ప్రస్తుతం రాష్ట్రస్థాయి అనుమతులకు అనేక నెలల సమయం పడుతుంది. వందల సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉంటున్నాయి.

పెండింగ్‌లో ఉంచితే ఆమోదించినట్లే!
కేంద్ర పర్యావరణ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. తెలంగాణ నుంచి రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి స్వర్గం శ్రీనివాస్‌, రాష్ట్ర పర్యావరణ ప్రభావ ప్రాధికార మదింపు సంస్థ (ఎస్‌ఈఐఏఏ) ఛైర్మన్‌ ఆనంద్‌రావు, నిపుణుల కమిటీ (ఎస్‌ఈఏసీ) ఛైర్మన్‌ కృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పర్యావరణ అనుమతుల దరఖాస్తుల పరిశీలన 105 రోజుల్లో పూర్తిచేయాలని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. అన్నీ సవ్యంగా ఉంటే వెంటనే అనుమతి జారీ చేయాలని.. తిరస్కరిస్తే ఆ విషయం దరఖాస్తుదారుకు స్పష్టం చేయాలని పేర్కొంది. ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో దరఖాస్తును ఆమోదించినట్లేనని పేర్కొన్నట్లు సమాచారం. పర్యావరణ అనుమతుల దరఖాస్తుల్లో ఇప్పటివరకు ఆన్‌లైన్‌ విధానం పాక్షికంగానే ఉంది. ఇకపై అంతా ఆన్‌లైన్‌లో చేపట్టనున్నారు. పేపర్‌ వాడకాన్ని పూర్తిగా పక్కనపెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త విధానం రాష్ట్రంలో అమల్లోకి రావడానికి దాదాపు 3 నెలల సమయం పట్టే అవకాశాలున్నట్లు సమాచారం.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.