Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177738
            [news_title_telugu_html] => 

‘370 ఆర్టికల్‌ రద్దు రాజ్యాంగ విరుద్ధం’

[news_title_telugu] => ‘370 ఆర్టికల్‌ రద్దు రాజ్యాంగ విరుద్ధం’ [news_title_english] => [news_short_description] => జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు అనేది రాజ్యాంగ విరుద్ధమని.. దాన్ని పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
‘370 ఆర్టికల్‌ రద్దు రాజ్యాంగ విరుద్ధం’ - EENADU
close
‘370 ఆర్టికల్‌ రద్దు రాజ్యాంగ విరుద్ధం’

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు అనేది రాజ్యాంగ విరుద్ధమని.. దాన్ని పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో టీపీపీ నేత శ్యామ్‌సుందర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. 370 ఆర్టికల్‌ రద్దు చేయాలనుకున్నపుడు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సీపీఐ నాయకులు అజీజ్‌ పాషా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ 370 ఆర్టికల్‌ రద్దును ఎందుకు సమర్ధించారో ప్రకటించాలన్నారు. ప్రొ. పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, పౌరహక్కుల సంఘం నేత చిక్కుడు ప్రభాకర్‌, సీపీఎం నేత డీజీ నర్సింహారావు తదితరులు మాట్లాడారు.

రైతునేస్తం పురస్కారాల దరఖాస్తు గడువు పొడిగింపు
వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పేరిట రైతునేస్తం ఫౌండేషన్‌ అందిస్తున్న పురస్కారాలకు ఆగస్టు 31 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో కృషి చేస్తున్న అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ జర్నలిస్టులు, విస్తరణ అధికారులను ఈ పురస్కారాలతో సత్కరించనున్నామని చెప్పారు. సాగు అనుభవాలను, పరిశోధన వ్యాసాలను, బయోడేటాతో కలిపి ఎడిటర్‌, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-500004కు పంపాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.