Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177742
            [news_title_telugu_html] => 

దేవాలయాలన్నింటిలో మట్టి వినాయక విగ్రహాలే

[news_title_telugu] => దేవాలయాలన్నింటిలో మట్టి వినాయక విగ్రహాలే [news_title_english] => [news_short_description] => వినాయక నవరాత్రుల సందర్భంగా తెలంగాణలోని అన్ని ఆలయాల్లో మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించనున్నట్లు అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
దేవాలయాలన్నింటిలో మట్టి వినాయక విగ్రహాలే - EENADU
close
దేవాలయాలన్నింటిలో మట్టి వినాయక విగ్రహాలే

 దేవాదాయశాఖ మంత్రి   ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వినాయక నవరాత్రుల సందర్భంగా తెలంగాణలోని అన్ని ఆలయాల్లో మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించనున్నట్లు అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను గురువారం హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఆలయ ఈవోలకు  అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పీసీబీ ద్వారా 1.60 లక్షల పర్యావరణహిత మట్టి విగ్రహాలను తయారు చేసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు.

దేశం, రాష్ట్రాల ప్రగతిలో సాంకేతికత కీలకం
శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతి ద్వారానే దేశం, రాష్ట్రాలు సామాజికంగా, ఆర్థికంగా ప్రగతిని సాధిస్తాయని ఈ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. కొత్త ఆవిష్కరణలను ఒకరికొకరు పంచుకోవాలని, సాంకేతికత ఫలాల్ని అది అవసరమైన చివరి వ్యక్తి వరకు చేర్చినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (టీఎస్‌కాస్ట్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు కనుగొనాలని, అవి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా ఉండాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.