Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177756
            [news_title_telugu_html] => 

ఓయోకు రూ.50,000 వడ్డన

[news_title_telugu] => ఓయోకు రూ.50,000 వడ్డన [news_title_english] => [news_short_description] => వినియోగదారుడికి సరైన సేవలు అందించకపోవడంతో పాటు తప్పుదోవ పట్టించినందుకు ఓయో రూమ్స్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 రూ.50,000 జరిమానా విధించింది. ఫిర్యాదుదారు ఎం.వి.రాజ్‌కుమార్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఓయోకు రూ.50,000 వడ్డన - EENADU
close
ఓయోకు రూ.50,000 వడ్డన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:  వినియోగదారుడికి సరైన సేవలు అందించకపోవడంతో పాటు తప్పుదోవ పట్టించినందుకు ఓయో రూమ్స్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరమ్‌-1 రూ.50,000 జరిమానా విధించింది. ఫిర్యాదుదారు ఎం.వి.రాజ్‌కుమార్‌ గాబ్రియెల్‌ వివరాల ప్రకారం... వేసవిలో తన కుటుంబంతో కలిసి డార్జిలింగ్‌, సిక్కింలోని పర్యాటక ప్రదేశాలు వెళ్లేందుకు ఓయో రూమ్స్‌ ద్వారా ఆయా ప్రాంతాల్లో హోటల్‌ గదులు బుక్‌ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి సిలిగురి, గ్యాంగ్‌టక్‌ ప్రదేశాల్లో విహరించిన అనంతరం పెల్లింగ్‌ను చేరుకుని చిరునామా కోసం అక్కడ బుక్‌ చేసుకున్న హోటల్‌కు ఫోన్‌ చేశారు. సదరు హోటల్‌ పెల్లింగ్‌లో కాదు డార్జిలింగ్‌లో ఉందని తెలిసింది. విస్తుపోయిన ఫిర్యాదుదారు అప్పటికప్పుడు మరో హోటల్‌లో దిగారు. ఓయో రూమ్స్‌ ద్వారా బుక్‌ చేసిన హోటళ్లను రద్దు చేసుకున్నారు. ఇతర హోటళ్లలో దిగి అసౌకర్యానికి గురయ్యానని ఫోరమ్‌కు వివరించారు. హోటల్‌ గదుల అద్దెకు వెచ్చించిన రూ.8,094 తిరిగి ఇప్పించాలంటూ ఫోరమ్‌-1ను ఆశ్రయించారు. వాదనలు విన్న ఫోరమ్‌ రాజ్‌కుమార్‌ గదుల అద్దె కోసం ఖర్చు పెట్టిన రూ.8,094 తిరిగి ఇవ్వడంతో పాటు రూ.50,000 పరిహారం, ఖర్చులకు రూ.5,000 నెల రోజుల వ్యవధిలో చెల్లించాలని ప్రతివాదులను ఆదేశించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.