Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177774
            [news_title_telugu_html] => 

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అమిత్‌షా

[news_title_telugu] => ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అమిత్‌షా [news_title_english] => [news_short_description] => శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ అభ్యర్థులకు శనివారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులు అభయ్‌ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. పరేడ్‌ ఏర్పాట్లపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అభ్యర్థుల ప్రాథమిక శిక్షణ ముగిసిందని, 12 మంది మహిళలతోపాటు మొత్తం 92 మంది [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అమిత్‌షా - EENADU
close
ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు అమిత్‌షా

జాతీయ పోలీసు అకాడమీలో  రేపు కార్యక్రమం
 శిక్షణలో పాల్గొన్న 92 మంది
 తెలంగాణ క్యాడర్‌కు పీఎం బ్యాటన్‌,  హోంమంత్రి రివాల్వర్‌  విజేత

ఈనాడు, హైదరాబాద్‌: శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌ అభ్యర్థులకు శనివారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులు అభయ్‌ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. పరేడ్‌ ఏర్పాట్లపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2017 బ్యాచ్‌ ఐపీఎస్‌ అభ్యర్థుల ప్రాథమిక శిక్షణ ముగిసిందని, 12 మంది మహిళలతోపాటు మొత్తం 92 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారని అభయ్‌ వివరించారు. 2016 బ్యాచ్‌కి చెందిన 19 మంది కూడా పరేడ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 11 మంది వైద్య విద్య అభ్యసించినవారు, 57 మంది ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారు ఉన్నారని తెలిపారు. ఆరుగురు భూటాన్‌, అయిదుగురు నేపాల్‌ దేశానికి చెందిన వారు కూడా శిక్షణ పూర్తిచేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంయుక్త సంచాలకులు మధుసూదన్‌రెడ్డి, ఉప సంచాలకులు నిఖిల్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల క్యాడర్లకు ఆరుగురు
శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థుల్లో ఏపీ, తెలంగాణ క్యాడర్లకు ముగ్గురు చొప్పున ఎంపికయ్యారు. వీరిలో దిల్లీకి చెందిన గోష్‌ అలాం, కర్ణాటకకు చెందిన జి.వినీత్‌, పి.శబరీష్‌లు తెలంగాణ క్యాడర్‌కు నియమితులయ్యారు. ఏపీకి చెందిన బిందు మాధవ్‌ గరికపాటి, తెలంగాణకు చెందిన వాసన్‌ విద్యాసాగర్‌నాయుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తుహిన్‌ సిన్హాలు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు ఎంపికయ్యారు. అత్యుత్తమ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరచి ప్రధానమంత్రి బ్యాటన్‌, హోంమంత్రి రివాల్వర్‌లు పొందిన గోష్‌ అలాం తెలంగాణ క్యాడర్‌కు చెందటం గమనార్హం. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన మొత్తం 42 మంది ప్రత్యేక ట్రోఫీలకు ఎంపికయ్యారు. వీరికి అమిత్‌షా చేతుల మీదుగా ట్రోఫీలు అందజేయనున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.