Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179677
            [news_title_telugu_html] => 

105 ఎంబీబీఎస్‌ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్‌

[news_title_telugu] => 105 ఎంబీబీఎస్‌ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్‌ [news_title_english] => [news_short_description] => రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో మిగిలిన 105 ఎంబీబీఎస్‌ సీట్లకు ఆఖరి విడత (మాప్‌అప్‌ రౌండ్‌) కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తవగా.. ఇంకా మిగిలిన సీట్లకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే వెబ్‌ఆప్షన్లకు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
105 ఎంబీబీఎస్‌ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్‌ - EENADU
close
105 ఎంబీబీఎస్‌ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్‌

నేటితో దరఖాస్తుకు ఆఖరి గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో మిగిలిన 105 ఎంబీబీఎస్‌ సీట్లకు ఆఖరి విడత (మాప్‌అప్‌ రౌండ్‌) కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తవగా.. ఇంకా మిగిలిన సీట్లకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే వెబ్‌ఆప్షన్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన సంక్షిప్త సందేశాలను అర్హులైన విద్యార్థులందరి మొబైల్‌ ఫోన్లకు పంపించింది. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపర్చారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అర్హులైన అభ్యర్థులందరూ ఈ నెల 26న (సోమవారం) సాయంత్రం 5 గంటల్లోపు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి కరుణాకరరెడ్డి తెలిపారు. తర్వాత రాత్రికి ఆఖరి విడత ప్రవేశ ఫలితాలను వెల్లడిస్తారు. కేటాయించిన కళాశాలల్లో చేరడానికి అభ్యర్థులకు ఈ నెల 29 వరకు గడువు ఇవ్వనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ప్రవేశాలకూ ఈ నెల 27తో గడువు ముగియనుంది. ఆయా కోటాల్లో  మాప్‌అప్‌ రౌండ్‌ను 28న నిర్వహించాలని వర్సిటీ యోచిస్తోంది. అప్పటికీ యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో సీట్లు మిగిలితే.. వాటిని ఆయా కళాశాలలకే     భర్తీ చేసుకోవడానికి అవకాశమిస్తారు. అన్ని కోటాల్లోనూ ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాలను ఈ నెల 31వ తేదీతో పూర్తి చేయాలనే ఎంసీఐ నిబంధన ఉండడంతో ఆ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.