Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179682
            [news_title_telugu_html] => 

8 లక్షల క్యూసెక్కుల నీరుకే మునక

[news_title_telugu] => 8 లక్షల క్యూసెక్కుల నీరుకే మునక [news_title_english] => [news_short_description] => రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. అమరావతిలో నిర్మాణం ఆర్థికంగా భారమేనని మరోమారు తేల్చి చెప్పారు. రూ.లక్ష వ్యయమయ్యే నిర్మాణానికి అమరావతిలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
8 లక్షల క్యూసెక్కుల నీరుకే మునక - EENADU
close
8 లక్షల క్యూసెక్కుల నీరుకే మునక

అమరావతిపై మళ్లీ స్పందించిన బొత్స

విజయనగరం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. అమరావతిలో నిర్మాణం ఆర్థికంగా భారమేనని మరోమారు తేల్చి చెప్పారు. రూ.లక్ష వ్యయమయ్యే నిర్మాణానికి అమరావతిలో రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలు అధికంగా వ్యయం అవుతుందన్నారు. దీనికి తోడు మొన్నటి కృష్ణా వరదలతో 8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే రాజధాని ప్రాంతం అల్లకల్లోలంగా మారిందని, 2009 మాదిరిగా కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితేంటని ప్రశ్నించారు. ఈ అంశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. రాజధాని విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతిపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో ద్వంద్వార్థాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని 5కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశమని, ఏ ఒక్క పార్టీ, ప్రాంతం, సామాజికవర్గానికి చెందినది కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయమై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీని పక్కనబెట్టి అప్పటి తెదేపా ప్రభుత్వం నారాయణ కమిటీని నియమించిందని, అది ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని సూచించిందని చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.