close
ఐదు నిమిషాలకు మించితే జరిమానా

ప్రధాన రైల్వేస్టేషన్ల ప్రవేశ ద్వారం వద్ద, దాని చుట్టుపక్కల వాహనాలను ఆపేవారికి విధింపు

ఈనాడు,హైదరాబాద్‌: రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు కారును పార్కింగ్‌ స్థలంలో కాకుండా స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్దగానీ, దాని చుట్టుపక్కలగానీ పెట్టి లోపలికి వెళితే.. నాలుగైదు నిమిషాల్లో తిరిగిరావాల్సిందే. 5 నిమిషాలకు మించి ఒక్క క్షణం ఆలస్యమైనా జరిమానా తప్పదు. ఆలస్యాన్ని బట్టి కనీసం రూ.100 నుంచి రూ.1000 జరిమానా విధించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రద్దీ అధికంగా ఉండే ప్రధాన స్టేషన్లలో దశలవారీగా దీనిని అమలు చేయనుంది. త్వరలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బోయిగూడ వైపు ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. స్టేషన్‌లోపలికి వచ్చే వాహనాలను గుర్తించేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలతో పాటు ఓ ప్రత్యేక బూత్‌ ఏర్పాటుచేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి వాహనం వివరాలను నమోదు చేస్తారు. వచ్చిన సమయం పేర్కొంటూ బూత్‌లో ఓ రశీదు ఇస్తారు. తిరుగుప్రయాణంలో ఆ రశీదును బూత్‌లో ఇవ్వాలి. 5 నిమిషాలు దాటితే సమయాన్ని బట్టి నిర్దేశిత జరిమానాను విధించనున్నారు. ఒకవేళ రశీదు పోయినా రూ.500 కట్టాల్సిందే. పార్కింగ్‌ స్థలంలో కాకుండా స్టేషన్‌ పరిసరాల్లో వాహనాలను చాలాసేపు నిలిపి ఉంచడంతో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు పెరుగుతున్నాయని రైల్వేశాఖ చెబుతోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.