close
అభిమాన నేతకు అశ్రు నివాళి

ఈనాడు, గుంటూరు: తెదేపా సీనియర్‌ నేత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు తెదేపా శ్రేణులు అశ్రు నివాళులు అర్పించాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి మంగళవారం ఉదయం 9.30కి ప్రత్యేక వాహన శ్రేణిలో కోడెల భౌతిక కాయంతో బయల్దేరారు. అంబులెన్స్‌ వెంట తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉన్నారు. వీరితో పాటు పలువురు నేతలు రాత్రికి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. భౌతిక కాయాన్ని రాత్రి 8.25కి  సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు. బుధవారం అక్కడ అంత్యక్రియలు జరగనున్నాయి.

కన్నీటి పర్యంతమైన తనయుడు
కెన్యా నుంచి వచ్చిన కోడెల కుమారుడు శివరాం.. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కంచికచర్ల-నందిగామ మధ్య తన తండ్రి పార్థివదేహం వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: ఏపీ సీఎం

కోడెల భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అంత్యక్రియల ఊరేగింపుపై నిషేధాజ్ఞలు లేవని గుంటూరు రేంజ్‌ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు.  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను కుటుంబసభ్యులు వద్దనుకున్నారని తెెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తెలిపారు. నరసరావుపేటలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు.

 

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.