close
మేడారం జాతరలో ఆదివాసీల ఆచారాలు కాపాడండి: సీతక్క

ఈనాడు, హైదరాబాద్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరను పూర్తిగా ఆదివాసీ ఆచార వ్యవహారాలతో నిర్వహించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం శాసనసభ జీరోఅవర్‌లో ఆమె మాట్లాడుతూ.. జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. వేడుకలు జరిగే 4 రోజులు సెలవుగా ప్రకటించాలన్నారు. అభివృద్ధి పనులకు ఇంకా నిధులు కేటాయించలేదని.. జాతర సమీపించాక హడావుడిగా పనులు చేస్తే అవినీతి జరిగే ఆస్కారం ఉంటుందని చెప్పారు. మంత్రులతో సమావేశం నిర్వహించామని.. సకాలంలో పనులు పూర్తిచేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానమిచ్చారు.

రెండు పడక గదుల ఇళ్ల కిటీకీ అద్దాలు పోతున్నాయి: గంప గోవర్ధన్‌
కామారెడ్డిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల గృహాల్లో ఇప్పటికే 1500 పూర్తయ్యాయని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలిపారు. మౌలిక వసతుల కల్పన పూర్తికాక వాటిలో ఎవరూ చేరడం లేదని.. దీంతో కిటికీల అద్దాలు ఎత్తుకెళ్తున్నారని చెప్పారు.రూ.2.29 కోట్లు కేటాయించాల్సి ఉందని కోరారు.

కాలుష్య పరిశ్రమల్ని కట్టడి చేయాలి: రాజగోపాల్‌రెడ్డి
నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న పరిశ్రమల్ని పీసీబీ కట్టడి చేయడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. పలు పరిశ్రమలతో స్థానికులకు ఉపాధి అవకాశాలు రాకపోగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో దాదాపు 150 పరిశ్రమలు పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ.. నిబంధనల విషయంలో పీసీబీ ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.

రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు: జైపాల్‌యాదవ్‌
తన నియోజకవర్గంలోని ఆమనగల్‌ పట్టణంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణ, కోర్టు కేసుల విషయంలో రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తెలిపారు. ఆ భూమిలో జూనియర్‌ కళాశాల నిర్మాణం చేపట్టాలని సూచించగా.. పరిశీలిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఆసరా పింఛన్లు అందించే బయోమెట్రిక్‌ పరికరాల్లో నేటికీ 2జీ సిమ్‌లే ఉపయోగిస్తుండటంతో సంకేతాలు అందక వృద్ధులకు పింఛన్లు చేరడం లేదని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు.
కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రవిశంకర్‌ కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.