close
విడాకులు ఇప్పించండి

జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు కుమారుడు వశిష్ట పిటిషన్‌

గన్‌ఫౌండ్రీ, న్యూస్‌టుడే: తన భార్య సింధూశర్మ నుంచి విడాకులు ఇప్పించి, పిల్లలను తన వద్దకు పంపించాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. న్యాయస్థానానికి వశిష్ట తన తల్లితో రాగా.. సింధూశర్మ తల్లిదండ్రులతో వచ్చారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న కౌంటర్‌ దాఖలు చేయాలని సింధూశర్మ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సింధూశర్మ మాట్లాడుతూ.. తనను అత్తమామలు చిత్రహింసలకు గురిచేశారని.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ దిశగా న్యాయం చేయాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.