close
ద.మ.రైల్వేకు 4 అవార్డులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంధన పొదుపు చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే జాతీయస్థాయిలో 4 అవార్డులు సాధించింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఏటా ప్రకటించే ఈ అవార్డులకు దేశంలోని ఇతర రైల్వే జోన్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పోటీపడ్డాయి. భవనాల విభాగంలో రైల్‌ నిలయం (ద.మ.రైల్వే ప్రధాన కార్యాలయం), సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, లేఖా భవన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ కార్యాలయ భవనాలకు అవార్డులు వచ్చినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఈ నెల 18న సీఐఐ వార్షిక సమావేశాల్లో  ఈ అవార్డుల్ని ప్రకటించగా.. సంబంధిత అధికారుల్ని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్య శుక్రవారం అభినందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.