close
బతుకమ్మ చీరల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: బతుకమ్మ చీరల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. జ్వరాల నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. శనివారం ఆయన బీఆర్‌కే భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘23వ తేదీ నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు ఘనంగా నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో మహిళలు పాల్గొనాలి. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన యూరియాను జిల్లాలకు సరఫరా చేశాం. దానిని రైతులకు సక్రమంగా పంపిణీ చేయాలి. అక్టోబరు నుంచి పత్తి అమ్మకాల సీజన్‌ వస్తోంది. అందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు పురపాలక సంఘాల్లో ఘనవ్యర్థాలను నిల్వ చేసేందుకు భూములను గుర్తించాలి. ద్రవవ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తరలించాలి. 2021 జనాభా లెక్కల సేకరణకు ఏర్పాట్లు చేశాం. దీనిపై త్వరలోనే సదస్సు నిర్వహిస్తాం. వివాదం లేని అటవీ, రెవెన్యూ భూముల వివరాలను ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నెలాఖరులోగా నమోదు చేయాలి’’అని సూచించారు.
* మరోవైపు ఈ నెల 27న చెన్నైలో జరిగే 11వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించే విషయాలకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్ర పౌరులకు, భవిష్యత్‌ తరాలకు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక ప్రాధికార సంస్థ(అథారిటీ)ని ఏర్పాటు చేస్తామని సీఎస్‌ చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.