close
బాలింతను మధ్యలోనే దించేశారు

ఆమె ఓ గిరిజన మహిళ..సాధారణ ప్రసవమై అయిదు గంటలు అయింది. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు 102 వాహనంలో బయల్దేరారు. రహదారి బాగా లేదన్న కారణంతో బాలింత అనే కనికరం కూడా చూపకుండా మార్గమధ్యలోనే దించేశాడు 102 వాహనం చోదకుడు. దీంతో చేసేదిలేక ఆ మహిళ గంటన్నర పాటు ఓ దుకాణం ముందు నేలపై పడుకోవాల్సిన దుస్థితి. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని చెమ్మన్‌గూడకు చెందిన రాఠోడ్‌ కల్పనకు పురిటినొప్పులు రావడంతో ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా శనివారం ఉదయం 5 గంటలకు సాధారణ ప్రసవమైంది. అనంతరం ఆమెను ఇంటికి తీసుకెళ్తున్న 102 వాహనం చోదకుడు రహదారి బాగా లేదని సిరికొండలోనే దించేశాడు. సిరికొండ నుంచి చెమ్మన్‌గూడ గ్రామం 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో గంటన్నర పాటు పసిపాపతో ఓ దుకాణం ముందు పడుకుంది. అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో ఇంటికి వెళ్లారు.

- సిరికొండ, న్యూస్‌టుడే

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.