close
రేపటి నుంచి బీఎస్సీ పారామెడికల్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఎస్సీ పారామెడికల్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో తొలివిడత ప్రవేశాలను ఈ నెల 19 నుంచి నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 19న ఉదయం ఏడు గంటల నుంచి 22న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్‌, ఫిజియోథెరపీ, సైన్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబోరేటరీ టెక్నాలజీ తదితర కోర్సుల్లో సీట్లు పొందాలనుకునే అర్హులైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కళాశాలల వారీగా ఖాళీలను ఈ నెల 18న కాళోజీ ఆరోగ్యవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

యాజమాన్య కోటాలో హోమియోపతి ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి కాళోజీ విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆచార్య రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో అర్హులైన అభ్యర్థులు నేరుగా ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.