close
జెన్‌కో ‘టీఎస్‌ శక్తి’ యాప్‌కు ఉత్తమ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) నిర్వహిస్తున్న ‘టీఎస్‌ శక్తి’ యాప్‌లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌కు ‘శాప్‌ ఏస్‌’ ఉత్తమ పురస్కారం వచ్చిందని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి, డిమాండ్‌ వంటి వివరాలను ప్రతీక్షణం ఈ యాప్‌లో నమోదు చేస్తారు. అన్ని కేంద్రాలను హైదరాబాద్‌లోని జెన్‌కో ప్రధాన కార్యాలయంతో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడం టీఎస్‌ శక్తి ప్రధానోద్దేశం. ఈ యాప్‌ కోసం ‘శాప్‌ ఈఆర్‌పీ’ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడానికి శాప్‌ ఇండియా సంస్థతో జెన్‌కో ఒప్పందం చేసుకుంది. దీని వినియోగం బాగున్నందున ‘2019 కస్టమర్‌ ఎక్సలెన్స్‌-శాప్‌ ఏస్‌’ పురస్కారానికి ఎంపికైనట్లు ఆయన వివరించారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో దీనిని జెన్‌కో అధికారులు అందుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.