close
ఇన్‌స్పైర్‌ ఛాలెంజ్‌ పురస్కారాల ప్రదానం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మాదాపూర్‌: ప్రపంచ ఆహార భద్రత అంశానికి సంబంధించిన ‘ఇన్‌స్పైర్‌ ఛాలెంజ్‌’ పురస్కారాలను శుక్రవారం రాత్రి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విజేతలకు బహూకరించారు. హైదరాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో ఇక్రిశాట్‌ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈనెల 16 నుంచి 18 వరకూ ఇక్రిశాట్‌లో నిర్వహించిన ‘బిగ్‌డేటా అనాలసిస్‌ ఇన్‌ అగ్రికల్చర్‌’ కార్యక్రమం ముగింపు సందర్భంగా దీనిని ఏర్పాటుచేశారు. 2019 సంవత్సరానికి మొత్తం నాలుగు ప్రాజెక్టులకు ఈ పురస్కారాలు దక్కాయి. తూర్పు ఆఫ్రికాలో భూగర్భ జలాల వాస్తవ గణాంకాల తీరుతెన్నులు, ఆఫ్రికాలో ఆకలిని తీర్చే ఆహార మార్కెట్లు, రొయ్యల జన్యువులపై పరిశోధన, వాతావరణ సమాచారంతో రూపొందించిన ‘లెట్‌ ఇట్‌ రెయిన్‌’ ప్రాజెక్టులు ఈ ఏడాది ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. విజేతలు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల చొప్పున బహూకరించారు. భారత్‌ నుంచి ఏ ప్రాజెక్టూ ఈ అవార్డులకు నోచుకోలేదు. 2018 సంవత్సరానికి సంబంధించి మరో నలుగురికి పురస్కారాలు ప్రదానం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆధునిక వ్యవసాయ విధానాల సమాచారాన్ని క్రోడీకరించి ఒక వేదికపైకి చేర్చడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.